
చెరువుల పునరుజ్జీవంతో రూపురేఖలు మారుతున్న మన హైదరాబాద్‌ను చూడటం ఎంతో సంతృప్తినిచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నగరంలోని చెరువులకు జీవం పోస్తూ, భావి తరాలకు మెరుగైన భవిష్యత్తును అంకితం చేస్తున్న హైడ్రా పనితీరును ఆయన అభినందించారు.
ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవానికి అహర్నిశలు శ్రమించిన హైడ్రా అధికారులకు, సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదని, అది భావి తరాల భవిష్యత్తును భద్రపరచడమేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి చెరువును కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షిస్తూ తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం చెప్పారు. నగరంలోని జలవనరుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
చెరువుల పునరుజ్జీవంతో రూపురేఖలు మారుతున్న మన హైదరాబాద్‌ను చూడటం నాకెంతో సంతృప్తినిచ్చింది!
హైదరాబాద్ CURE పరిధిని క్యూర్ చేసుకుంటూ … మన చెరువులకు జీవం పోస్తూ… భావి తరాలకు జీవంతో నిండిన భవిష్యత్తును అంకితం చేస్తోంది #HYDRAA
ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవానికి అహర్నిశలు… https://t.co/VTEyDId0Fk
— Revanth Reddy (@revanth_anumula) August 1, 2026