Reading Time: < 1 minute

కామన్వెల్త్‌లో భారత్ జోష్.. గోల్డ్ మెడల్ సాధించిన జాస్మిన్ లంబోరియా.. 7 స్వర్ణ పతకాలతో దూకుడు

Caption of Image.

Jasmine Lamboria: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 బాక్సింగ్ రింగ్‌లో భారత మహిళా బాక్సర్లు బ్యాక్-టూ-బ్యాక్ గోల్డ్ మెడల్స్‌తో చరిత్ర సృష్టించారు. మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ స్వర్ణం సాధించిన వెంటనే.. కొద్దిసేపటికే జరిగిన 57 కేజీల విభాగం ఫైనల్లో జాస్మిన్ లాంబోరియా కూడా పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో భారత్ ఖాతాలో 7వ స్వర్ణ పతకం వచ్చి చేరింది. 

జాస్మిన్ గోల్డెన్ పంచ్: 
మహిళల 57 కేజీల విభాగం ఫైనల్ పోరులో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన దిగ్గజ బాక్సర్ మైఖేలా వాల్ష్‌తో జాస్మిన్ పోటీ పడింది. మ్యాచ్ అంతటా హోరాహోరీ పోరు కొనసాగినప్పటికీ, జాస్మిన్ తన వ్యూహాత్మక పంచ్‌లతో ప్రత్యర్థిని దెబ్బతీసి Unanimous Decision (ఏకగ్రీవ తీర్పు)తో గ్రాండ్ విక్టరీ సాధించింది. విజేతగా నిలిచిన తర్వాత జాస్మిన్ ప్రత్యర్థి మైఖేలా వాల్ష్‌ను ఆత్మీయంగా కౌగిలించుకుని, ఆమె చేతిని పైకి ఎత్తి ప్రేక్షకుల చప్పట్లు అందుకునేలా చేసింది. ఈ అద్భుత క్రీడాస్ఫూర్తి అందరినీ ఆకట్టుకుంది. 

ప్రీతి పవార్ గోల్డెన్ దండయాత్ర: 
జాస్మిన్ విక్టరీకి కంటే ముందే 22 ఏళ్ల భారత యువ కిరణం ప్రీతి పవార్ 54 కేజీల ఫైనల్లో కెనడా బాక్సర్ స్కార్లెట్ సవన్నా డెల్గాడోను 5–0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి భారత్‌కు 6వ స్వర్ణాన్ని అందించింది. ప్రతి రౌండ్‌ను 5–0తో కైవసం చేసుకుని ప్రీతి అద్భుతమైన కౌంటర్ పంచ్‌లు, ఫుట్‌వర్క్‌తో ప్రత్యర్థిని దెబ్బతీసింది. ఇప్పటికే ఈ ఏడాది వరల్డ్ బాక్సింగ్ కప్, ఏసియన్ ఛాంపియన్‌షిప్ టైటిళ్లు గెలుచుకున్న ప్రీతి.. ఇప్పుడు కామన్వెల్త్ గోల్డ్‌తో తన డ్రీమ్ ఫామ్‌ను కొనసాగించింది. 

 

 

©️ VIL Media Pvt Ltd.