
హైదరాబాద్: హైదాబాద్ కు తలమానికంగా నిలిచేలా నాంపల్లి రైల్వే స్టేషన్లను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజా రవాణాను మరింత పెంచాలని అన్నారు. నాంపల్లి రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా నాంపల్లిల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్ లో ప్రయాణికుల సంఖ్య ఎంత పెరిగినా.. వసతులు ఉండేలా.. అంతర్జాతీయ విమానాశ్రయాల తరహాలో రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. నాంపల్లిలో రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.350 కోట్లు కేటాయిస్తున్నామని, నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి మెట్రో స్టేషన్ కు స్కెవాక్ ఏర్పాటు చేస్తామని అన్నారు. 2027 చివరికల్లా నాంపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.