Reading Time: < 1 minute

ఐసిసి టి-20 ప్రపంచకప్ అంతిమ దశకు చేరకుంది. బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. కాగా, గురువారం రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌లో కివీస్‌తో తలపడుతుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ భారత జట్టుకు ఓ కీలక సూచన చేశాడు. కుల్దీప్‌కి జట్టులో చోటు కల్పించాలని అన్నాడు.

‘‘నేనైతే కుల్దీప్ యాదవ్‌ని ఆడిస్తాను. అతడి బౌలింగ్‌లో ఆడటానికి ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇబ్బంది పడతారు. లోయర్ ఆర్డర్‌లో తిలక్ వర్మ.. శివమ్ దూబేలను ఆడిచడం అవసరమా.? దానికి బదులుగా కుల్దీప్‌ని జట్టులోకి తీసుకోవాలి. అయితే అతడికి ఆడే అవకాశాలు పెద్దగా రాలేదు కాబట్టి.. ప్రస్తుతం అతడు ఫామ్‌లో ఉన్నాడా? లేదా నాకు తెలియదు. కానీ, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతడిని ఆడిస్తే బాగుంటుంది’’ అని వాన్ అన్నాడు. అంటే పరోక్షంగా కుల్దీప్‌ని జట్టులో తీసుకుంటే విజయం భారత్ సొంతమవుతుందని అభిప్రాయపడ్డాడు.