
జెరూసలెం: అమెరికా, ఇజ్రాయిల్ కు బుద్ధి చెప్పేవరకు యుద్ధం కొనసాగుతుందని జనరల్ కియూమార్స్ హైదరీ తెలిపారు. యుద్ధం ఎంతకాలం సాగినా వెనక్కి తగ్గేది లేదని అన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ పై ఇరాన్ జనరల్ కియూమార్స్ హైదరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఎన్ని రోజులు సాగినా ఇరాన్ కు సమస్య లేదని, తమ లక్ష్యాలను నెరవేరే వరకు యుద్ధాన్ని ఆపమని తెలియజేశారు. శత్రువులు పశ్చాత్తాపడేలా చేసి యుద్ధాన్ని ముగిస్తామని, గతంలో 8 ఏళ్ల యుద్ధాన్ని ఎదుర్కొన్న అనుభవం తమకుందని కియూమార్స్ పేర్కొన్నారు.