Reading Time: < 1 minute

ఓబి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’తో అభిమానులను అలరించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది ఈ మూవీ. అయితే, మార్చి 26న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించినా.. క్లారిటీ లేకపోవడంతో.. నెట్టింట రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈక్రమంలో అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. గురువారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ.. మేకర్స్ కొత్త పోస్టర్ ను వదిలారు.

గతంలో ప్రకటించిన తేదీ కంటే వారం ముందుగానే ఉగాది కానుకగా మార్చి 19న ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ మూవీలో శ్రీలీల, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తునారు. డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.