Reading Time: < 1 minute

హైదరాబాద్: జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులు ఏ పార్టీలోనైనా చేరవచ్చునని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాపంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది అని అన్నారు. తెలంగాణకు కేంద్రం చేసిన పనులపై లెక్కలతో సహా లేఖ రాసినా..ఏ ఒక్క కాంగ్రెస్ నేత స్పందించలేదని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని తెలియజేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులిచ్చే పరిస్థితి లేని సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి..రూ వెయ్యి కోట్ల పార్టీ ఫండ్ ఎలా సమకూరుతుంది? అని ప్రశ్నించారు. రూ.5 వేల కోట్ల బాపుఘాట్, రూ.1.50 లక్షల కోట్ల మూసీ ప్రక్షాళన వెనుక కమీషన్లను గమనిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.