
తండేల్ బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్న యువ సామ్రాట్ నాగ చైతన్య మరోసారి క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. బ్లాక్‌బస్టర్ ‘విరూపాక్ష’తో ఆకట్టుకున్న డైరెక్టర్ కార్తీక్ దండుతో కలిసి ప్రతిష్టాత్మక మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ ను మేకర్ విడుదల చేశారు. పాన్ ఇండియా మూవీ రాబోతున్న ఈ మూవీ గ్లింప్స్ విజువల్స్, సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇది సినిమాపై అంచనాలను పెంచేసింది.
భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌విసిసి, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు. ఈ మూవీ కోసం నాగచైతన్య..కండలు తిరిగిన శరీరం, ఇంటెన్స్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ పాత్ర కోసం నాగ చైతన్య మాసీవ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, లాపతా లేడీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.