
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా వైమానిక పరిమితులు విధించడంతో భారత్ లో భారీగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం విమాన సర్వీస్ లకు అంతరాయం కలిగింది.
ముంబయిలో అత్యధికంగా 93 విమానాలు రద్దు చేశారు. వీటిలో 48 అవుట్‌బౌండ్.. 45 ఇన్‌బౌండ్ సేవలు ఉన్నాయి. ఢిల్లీలో 52 విమానాలను నిలిపేశారు. బెంగళూరులో 34 విమాన సర్వీసులు రద్దయాయి. వాటిలో 18 ఇన్‌కమింగ్ విమానాలు ఉన్నాయి.