
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది.
ఇక, బుధవారం తిరుమల వెంకన్నను 63,772 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 24,013 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.47 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.