
మన తెలంగాణ/మోత్కూర్: గ్రామాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాలు, పల్లె దవాఖానాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తలు అన్నారు. బుధవారం మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురంలోని పల్లె దావఖానాను అషుమాన్ ఆరోగ్య మందిరంను వారు కౌన్సిలర్ లతో కలిసి సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలపాలన్నారు. మోత్కూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య ,వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్త, మున్సిపల్ కౌన్సిలర్ లు మొగుళ్ల అనూరాధ శ్రీనివాస్ రెడ్డి, నల్ల మధు, గనగాని శైలజ నర్సయ్య, కారుపోతుల వెంకన్న లను వైద్య సిబ్బంది శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ లు త్రివేణి, సూపర్ వైజర్ ఊర్మిల , ఏ ఎం ఎం లు నాగమణి, గురువమ్మ, ఆశా కార్యకర్తలు ఉమ, రేణుక, వసంత, లలిత తదితరులు పాల్గొన్నారు.