
శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్క ర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 6న గ్రాం డ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో హీరో శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ “ఈ సినిమాకి ఫస్ట్ హీరో మా ప్రొడ్యూసర్. ఆయనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారు. సెకండ్ హీరో మా డైరెక్టర్. నన్ను బలంగా నమ్మి ఈ క్యారెక్టర్ కి నేనైతే బాగుంటుందని హీరోగా పెట్టారు. మా నిర్మాత, డైరెక్టర్ నమ్మకాన్ని నిలబెట్టానని భావిస్తున్నాను. నిజాయితీతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం”అని అన్నా రు. నిర్మాత రాజేష్ మాట్లాడుతూ “బాల సతీష్, నేను కథ విషయంలో చాలా కసరత్తు చేశాం. ఈ సినిమా విజయం మీద చాలా నమ్మకంగా ఉన్నాము”అని తెలిపారు. ఈ సమావేశంలో హీరోయిన్లు గాయత్రి రమణ, కామాక్షి భాస్కర్ల, రాజ్ కుమార్ కసిరెడ్డి, సురేష్ బొబ్బిలి పాల్గొన్నారు.