
న్యూఢిల్లీ: ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్ కూటమి నడుమ యుద్ధం గల్ఫ్ దేశాలను దాటి విస్తరిస్తోంది. బుధవారం తెల్లవారుజామున శ్రీలంక తీ రం ప్రాంతం గాలె సమీపంలో ఇరానియన్ నౌక పై జలాంతర్గామి దాడి జరిగింది. ఈ దాడిలో 101 మంది మృతి చెందారు.78 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకు 87 మృతదేహాలు సము ద్రం నుంచి వెలికి తీసినట్లు శ్రీలంక నౌకాదళం ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన ‘ఐఆర్‌ఐఎస్ దే నా’ అనే యుద్ధనౌక శ్రీలంక తీర ప్రాంతం మీదు గా తిరిగి ఇరాన్ వెళుతుండగా ఈ దాడి జరిగిం ది. అది తమపనేనని అమెరికా సాయంత్రానికి ప్రకటించింది. జలాంతర్గామి టార్పెడోలతో ఇరాన్ యుద్ధ నౌక ను ముంచేశామని అమెరికా రక్ష ణ మంత్రి పీటర్ హెగ్సెత్ ప్రకటించారు. భా రతదేశంలోని విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ‘మిలాన్2026’ పలు దేశాల నావికా వి న్యాసాల లో పాల్గొన్న తర్వాత ఇరాన్‌కు తిరిగి వె ళ్తుండగా ఈ దాడి జరిగింది.
స్వల్పంగా గాయప డిన వారికి చికిత్స అందిస్తున్నామని శ్రీలంక ఆ రోగ్యశాఖ ఉన్నతాధికారి డాక్టర్ అ నిల్ జా సింగ్ తెలిపారు. అనంతరం శ్రీలంక నౌకాదళం ఓ ప్రకటనలో మొత్తం 79 మందిని రక్షించి ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు, వారిలో ఒ కరు మరణించినట్లు, మ రో 101 మంది తప్పిపోయినట్లు తెలిపింది. నౌక మాత్రం సముద్ర జలాలలో మునిగిపోయిందని వివరించింది. దాదాపు 180 మం దితో కూడిన ఐఆర్‌ఐఎస్ దేనా నౌక ప్రమాదం లో ఉందని శ్రీలంక నావికా దళానికి అత్యవసర సందేశం అందిందని, వెంటనే ఓడలు, వై మానిక దళ విమానాలు సహాయ చర్యలకోసం పంపిన ట్లు లంక విదేశాంగమంత్రి విజిత హరా త్ పార్లమెంటులో ప్రకటించారు.
పేలుడు వల్లే మునక..
పెద్ద పేలుడు సంభవించడంతో నౌక దెబ్బతిన్నద ని సిబ్బంది చెప్పినట్లు శ్రీలంక నావికా దళం వ ర్గాలు బుధవారం తెలిపాయి. నౌక మునిగిపోయిన ప్రాంతంలో కొన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఓడ మునిగిపోయిన ప్రాంతం నుంచి తాము కొందరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, మరి కొందరి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నామని శ్రీలంక నావికాదళ ప్రతినిధి బుద్ధిక సంపత్ కొలంబోలో విలేకరులకు తెలిపారు.
అది మా పనే : అమెరికా
హిందూ మహా సముద్రంలో ఇరాన్ నౌకను జలాంతర్గామి టార్పెడోలతో ముంచేశామని అమెరికా రక్షణమంత్రి పీటర్ హెగ్సెత్ వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక శత్రుదేశంపై జరిగిన అతి భారీ దాడిగా ఆయన అభివర్ణించారు. త్వరలో మరిన్ని దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. కొద్ది రోజుల్లో ఇరాన్ గగనతలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. ఇరాన్‌పై అమెరికా మరింత విజయం సాధించిందన్నారు. తమ వద్ద అపరిమిత సంఖ్యలో గ్రావిటీ బాంబులు ఉన్నాయని, వాటిని కూడా ఉపయోగిస్తామన్నారు.