
మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను బుధవారం సాయంత్రం ఎంపి క చేసింది. వీరిలో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అ భిషేక్ మను సింఘ్వి, మరో అభ్యర్థిగా ముఖ్యమంత్రి సన్నిహితుడు, రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అధిష్టానం ఎంపిక చేసింది. సింఘ్వి ఎంపిక ముందే ఖరారు కావడంతో ఆయన బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. తన నామినేషన్‌కు సంబంధించిన ప్రక్రియపై పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్‌తో సమావేశ మై చర్చించారు. పలు సీనియర్ నాయకులు సిం ఘ్వికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే మరో అభ్యర్థి ఎంపికపైనే చివరి వరకూ సస్పెన్స్ నెలకొన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం ఢిల్లీకి వెళ్ళి పార్టీ పెద్దలతో చర్చించి వేం నరేందర్‌రెడ్డి ఎంపిను ఖరారు చేశారు. సా యంత్రం ఢిల్లీలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీకి ముందే రాష్ట్ర నాయకులకు ఫోన్ ద్వారా వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేసిన విషయాన్ని తెలియజేశారు.
రాష్ట్రం నుంచి ఖాళీకాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల కోసం పార్టీ సీనియర్ నాయకులు తీవ్రం గా ప్రయత్నించినప్పటికీ చివరకు అధిష్టానం ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయం మేరకు వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేసింది. ఈ పదవి కోసం పార్టీ నుంచి పదహారు మంది ఆశావాహులు లా బీయింగ్ చేసినప్పటికీ చివరకు వారికి నిరాశే ఎ దురైంది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అ త్యంత సన్నిహితుడు కావడమే కాకుండా తన రా జకీయ ప్రస్థానంలో మొదటి నుంచి రేవంత్ రెడ్డికి తోడుగా ఉన్నారు. వీరిద్దరు గతంలో తెలుగు దే శం పార్టీలో కూడా కలిసి పని చేశారు. అదే పార్టీ లో వీరిద్దరు ఎమ్మెల్యేలుగా కూడా కొనసాగారు. రేవంత్ రెడ్డి టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన సమయంలోనే ఆయనతో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. సిఎం రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి మొదటి నుంచి అత్యంత సన్నిహితునిగా కొనసాగడమే కాకుండా ఆయన కుడి భుజంగా పేరు తెచ్చుకున్నారు.
సింఘ్వి ఎంపిక పూర్తిగా అధిష్టానం నిర్ణయమే..
కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఉన్న సింఘ్వి రాజ్యసభకు తెలంగాణ రాష్ట్రం నుంచే ఎంపికైనప్పటికీ ఆయన పదవీ కాలం అర్థాంతరంగా ముగిసింది. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు బిఆర్‌ఎస్ పార్టీకి, రాజ్యసభ సభ్యునిగా రాజీనామా చేయడంతో ఏర్పడిన మిగిలిన పదవీ కాలానికి సింఘ్విని ఎంపిక చేయడం జరిగింది. అది కూడా ఏప్రిల్ తొమ్మిదో తేదీతో ముగియనుండడంతో ఈ సారి పూర్తి స్థాయి పదవీ కాలానికి సింఘ్విని రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. పార్టీకి సంబంధించిన కోర్టు వ్యవహారాలన్నింటినీ సింఘ్వి చూసుకుండడంతో పార్టీ పెద్దలు సింఘ్వి అభ్యర్థిత్వానికి మొగ్గు చూపింది. ఈ విషయాన్ని ఇటీవల రాహుల్ గాంధీ వికారాబాద్‌లో ఏర్పాటైన పార్టీ శిక్షణా తరగతులకు హాజరైన సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి సింఘ్వి ఎంపికపై సంకేతం ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం.
నేడు నామినేషన్లు
రాజ్యసభ పోటీకి నామినేషన్ల దాఖలుకు గురువారం చివరి తేదీ కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన ఇద్దరు అభ్యర్థులు అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఉదయం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ కూడా హాజరుకానున్నారు.