
అమరావతి: ‘ఇంధ్ర ధనస్సులో భాగంగా దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఎపిఎస్‌ఆర్టిసి తెలిపింది. ఈ కార్యక్రమాన్ని మార్చి 18న సిఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారని ఆర్టిసి ఎండి ప్రకటించారు. 40 శాతం పైన వైకల్యం ఉన్న దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. సిటి ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దీన్ని అమలు చేస్తామని అన్నారు. దివ్యాంగుల సహాయకుడికి టికెట్ ఛార్జీలో 50 శాతం రాయితీ ఉంటుందని వివరించారు.