
రాజమండ్రి: కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. తాజాగా ఈ ఘటనలో సూర్యకళ అనే మహిళ ప్రాణాలు విడిచింది. కల్తీపాలు తాగి తీవ్ర అనారోగ్యానికి గురి కాగా.. కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ సూర్యకళ మృతి చెందింది. దీంతో ఈ కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. మరి కొంత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.