Reading Time: < 1 minute

జెరూసలెం: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీఖమేనీ వారసులుగా ఎవరు వచ్చినా వారిని లక్షంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ బుధవారం హెచ్చరించారు. ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనుకునే వారిని వదిలిపెట్టేది లేదన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. 1979 ఇస్లామిక్ రివల్యూషన్ దగ్గర నుంచి రెండోసారి ఇరాన్ సుప్రీం లీడర్‌ను ఎన్నుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఎన్నికైన వారు ఎవరైనా, లేదా ఎక్కడ దాగున్నా ఇజ్రాయెల్ ప్రధాని, తాను ఆపరేషన్ “లయన్స్ రోర్ ”లో భాగంగా మట్టుబెట్టడానికి సిద్ధంగా ఉండాలని ఐడిఎఫ్‌ను ఆదేశించామని చెప్పారు.

ఇదిలా ఉండగా టెహ్రాన్‌పై బుధవారం ఉదయం పదోసారి దాడులు ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్‌ఫోర్సెస్ (ఐడీఎఫ్) వెల్లడించింది. టెహ్రాన్‌లో ఇరాన్ ఉగ్రవాద ప్రభుత్వ మౌలిక సౌకర్యాలను లక్షంగా చేసుకుని భారీ ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించినట్టు పేర్కొంది. అమెరికా భాగస్వామ్యంతో పూర్తి బలగాలతో దాడులు కొనసాగుతాయని వివరించింది.