Reading Time: < 1 minute

తమిళ హీరో అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కార్తీ. కార్తీ నటించిన రీసెంట్ చిత్రం ‘వా వాతియర్’. తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌తో ఈ సినిమాను విడుదల చేశారు. నలన కుమారస్వామి దర్శకతంలో తెరకెక్కిన ఈ సినిమాను కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా తమిళ వెర్షన్ ఒటిటిలో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్‌లోమార్చి 6వ తేదీ నుంచి తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ప్రైమ్‌ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఇందులో కార్తి స్వయంగా తన సినిమా విశేషాలను పంచుకున్నారు.‘‘ అన్నగారి ఆగమనం. ‘అన్నగారు వస్తారు’మార్చి 6 నుంచి నుంచి ప్రైమ్‌ వీడియోలో’’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను విడుదల చేశారు.