Reading Time: < 1 minute

చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తుమ్మదపాలెంలో కాల్పుల కలకలం రేగింది. సాయి కుమార్ అనే యువకుడిని మరో యువకుడు ఢిల్లీ నాటు తుపాకీతో కాల్చాడు. దీంతో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఢిల్లీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా సిసిటివి ఫుటేజులను పరిశీలిస్తున్నారు. మృతుడు, నిందితుడి మధ్య ఉన్న గత పరిచయాలపై ఆరా తీస్తున్నారు. త్వరగా కేసును చేధస్తామని పోలీసులు తెలిపారు.