
ప్రస్తుతం జరుగుతున్న టి-20 ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్ దేనికదే సాటి అన్నట్లు ఉత్కంఠగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టోర్నమెంట్ వ్యూయర్‌షిప్ పరంగా రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటివరకూ భారత్‌లో ఈ టోర్నమెంట్‌ను 50 కోట్ల మంది వీక్షించినట్లు ఐసిసి ఛైర్మన్ జై షా తెలిపారు. టి-20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే రికార్డు అని వెల్లడించారు. జియో హాట్‌స్టార్ యాప్‌లో గరిష్టంగా 6.05 కోట్ల మంది వీక్షించినట్లు పేర్కొన్నారు. రానున్న మ్యాచులు కూడా ఇదే స్థాయిలో వీక్షిస్తే.. కొత్త రికార్డును నమోదు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
‘‘ప్రస్తుత టి-20 ప్రపంచకప్ 2026ను అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈవెంట్‌గా మార్చాలనే ఆశయంతో ప్రారంభించాం. భారత దేశంలో ఈ ఈవెంట్ వీక్షకుల సంఖ్య 50 కోట్లను (500 మిలియన్లు) దాటింది. టి-20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇది అత్యధికం. జియో హట్‌స్టార్‌లో వీక్షకుల సంఖ్య 6.05 కోట్లకు (60.5 మిలియన్లు) చేరుకుంది. ఈ రాత్రి నుంచి నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. వీటిని భారత అభిమానులు వీక్షించి, మరిన్ని రికార్డులు బద్దలు కొట్టాలని ఆశిస్తున్నాం’’ అని జై షా పేర్కొన్నారు.