Reading Time: < 1 minute

శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధనౌకపై దాడి జరిగింది. ఇరాన్‌కు చెందిన ఐరిస్‌ డెనా యుద్ధనౌకపై సబ్‌మెరైన్‌తో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 100 మందికి పైగా గల్లంతైనట్లు శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. మరో 78 మంది గాయపడినట్లు చెప్పారు. దాడి జరిగిన తర్వాత సమాచారం అందుకున్న శ్రీలంక నావికాదళం వెంటనే అప్రమత్తమైన సహాయక చర్యలు చేపట్టింది. మునిగిపోతున్న ఇరాన్ యుద్ధనౌక నుంచి 32 మందిని రక్షించి ఆసుపత్రిలో చేర్చామని శ్రీలంక నేవీ అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో యుద్ధనౌకలో దాదాపు 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.