Reading Time: < 1 minute

ఐసిసి తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటంచింది. మహిళ క్రికెట్‌లో ప్రకటించిన ఈ ర్యాంకుల్లో టీం ఇండియా స్టార్ స్మృతి మందన్న మొదటి ర్యాంకును మరోసారి సొంతం చేసుకుంది. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 790 పాయింట్లతో స్మృతి ఒక స్థానం మెరుగుపరుచుకొని నెం.1గా నిలిచింది. సౌతాఫ్రికా ప్లేయర్ లారా వొల్వార్డ్ 782 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయయింది. ఇక భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకు టాప్‌-9 ర్యాంకులో స్థిరతపడింది. మరో ప్లేయర్ జెమీమా 12వ స్థానంలో ఉంది. స్పిన్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ 10 పాయింట్లు కోల్పోయి 29వ ర్యాంకుకు పడిపోయింది. బౌలింగ్‌లో విభాగంలో దీప్తిశర్మ 5 స్థానాలు కోల్పోయి 10వ స్థానంలో నిలిచింది. తెలుగు అమ్మాయి శ్రీచరణి మూడు స్థానాలు కోల్పోయి 26వ ర్యాంకు సొంతం చేసుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా పేసర్ అలానా కింగ్ నెం.1లో నిలిచింది.