
అమరావతి: బెలూన్ గొంతులో ఇరుక్కోవడంతో చిన్నారి మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పెదకాకానిలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… నాలుగేళ్ల వయసు గల శిరీష అనే చిన్నారి బెలూన్‌తో ఆడుకుంటుంది. బెలూన్ ఊదుతుండగా గొంతులో ఇరుక్కోవడంతో స్పృహతప్పిపడిపోయింది. వెంటనే చిన్నారిని గుంటూరులోని జిజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బెలూన్ ఎంత పని చేసిందిరా? నయానా అంటూ తల్లి కన్నీరుమున్నీరు అవుతోంది. పెద్దకాకాని గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.