
లక్నో: అత్యాచారం కేసు నుంచి తప్పించుకోవడానికి అప్పు తీసుకున్న వ్యక్తిని చంపేసి నిందితుడి స్థానంలో కారులో మృతదేహాన్ని పెట్టి అనంతరం వాహనాన్ని తగలబెట్టాడు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సహరన్‌పూర్ ప్రాంతంలో జరిగింది. బిహారీగఢ్ గ్రామంలో అర్జున్, రాబిన్, విద్యాసాగర్ అనే స్నేహితులు ఉన్నారు. అర్జున్ డెహ్రాడూన్‌లో ఓ బ్యూటీ పార్లర్‌కు కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. అక్కడే ఓ మహిళపై అత్యాచారం చేయడంతో అతడి జైలు జీవితం గడిపి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అతడి యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది. శిక్షను తప్పించుకోవడానికి పలురకాలుగా ప్లాన్లు వేసున్నాడు. తన స్థానంలో ఓ వ్యక్తిని తగలబెడితే తప్పించుకోవచ్చని ప్లాన్ వేశాడు. రోహిత్ అనే వ్యక్తి అర్జున్ నుంచి 1.7 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఇప్పటివరకు రోహిత్ చెల్లించలేదు. రోహిత్‌ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మద్యం పూటుగా తాగించారు. అర్జున తన ముగ్గురు స్నేహితులు రాబిన్, విజయ్ సాగర్, షరీక్‌తో కలిసి రోహిత్‌ను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముందు సీట్లో ఉంచి తగలబెట్టారు. ఈ చంద్‌పూర్, చోర్ఖ్‌ర్డ్ గ్రామాల మధ్యలో ఈ సంఘటన జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారు నంబర్ ఆధారంగా అర్జున్‌దిగా గుర్తించారు. అప్పటికే అర్జున్ డెహ్రాడూన్ పారిపోయాడు. అక్కడి కటింగ్ చేసుకొని మరో వ్యక్తి పేరుతో సిమ్ తీసుకొని వాడుతున్నాడు. విచారణలో కారు తన తమ్ముడు అర్జున్‌దేనని విజయ్ సాగర్ పోలీసులకు తెలిపారు. రాబిన్‌తో కలిసి బయటకు వెళ్లాడని సమాచారం ఇచ్చారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి రాబిన్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నారు. వెంటనే నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.