
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలం వైఎస్‌ఆర్ జంక్షన్ వద్ద సిమెంట్ లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. కారు బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.