Reading Time: < 1 minute

ఆమనగల్లు: న‌ల్ల‌గొండ జిల్లా వేములపల్లి మండలంలోని ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో భక్తులు నిప్పుల గుండంలో పడిపోయారు.  ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. నిప్పుల్లో పడ్డవారిని భక్తులు, పోలీసులు బయటకు లాగారు. ​గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో భక్తులు పడిపోయినట్టు సమాచారం.