
కోల్‌కతా: ఇంగ్లండ్‌తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ నుంచి ఓపెనర్ అభిషేక్ శర్మను తప్పించాలని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సూచించాడు. చెత్త బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో నిరాశ పరుస్తున్న అభిషేక్‌ను తప్పించి మరో ఆటగాడికి చోటు కల్పించాలని పేర్కొన్నాడు. వరుస వైఫల్యాలు చవిచూస్తున్న అభిషేక్‌కు ఇప్పటికే ఎన్నో అవకాశాలు కల్పించారని, అయినా అతని ఆట ఏమాత్రం బాగా పడలేదన్నాడు. ప్రస్తుతం అభిషేక్‌లో నిర్లక్షం పేరుకు పోయిందని, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ తేలిపోతున్నాడన్నాడు. ఇలాంటి స్థితిలో అతన్ని తప్పించడమే మంచిదని తివారీ అభిప్రాయపడ్డాడు.