Reading Time: < 1 minute

హైదరాబాద్: టి20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. కానీ బౌలింగ్‌లో బుమ్రా తప్పితే అందరూ బౌలర్లు దారుళంగా పరుగులు ఇస్తున్నారు. గురువారం భారత్-ఇంగ్లాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇంగ్లాండ్‌లో పదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు ఉన్నారు. స్పిన్ బౌలింగ్ లో బాగా ఆడగలరు. కానీ వరుణ చక్రవర్తి గత రెండు మ్యాచ్‌లలో దారుళంగా పరుగులు సమర్పించుకోవడంతో అతడిని తప్పించి కులదీప్ యాదవ్‌కు జట్టులోనికి తీసుకోవాలని కొందరు మాజీలు సూచిస్తున్నారు. మిడిల్ ఓవర్లలో కులదీప్ వికెట్లు తీస్తుండడం అతడికి సానుకూలంగా మారింది. టీమిండియా ఫైనల్‌కు చేరాలంటే ఇంగ్లాండ్‌పై అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి వస్తుంది. అలాగే ఫీల్డర్లు కూడా క్యాచ్‌లు వదలకూడదని క్రికెట్ పండితులు హెచ్చరిస్తున్నారు. ఫీల్డింగ్ తప్పిదాలతోనే ప్రత్యర్థి జట్టు 20 నుంచి 30 పరుగులు ఎక్కువ చేస్తోందని మాజీలు సూచిస్తున్నారు. ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్‌లో మంచి ప్రదర్శన ఇస్తేనే ఇంగ్లాండ్‌పై భారత జట్టు గెలుస్తుందన్నారు. లేకపోతే ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తుందని క్రికెట్ పండితులు హెచ్చరిస్తున్నారు. అభిషేక్ శర్మ క్యాచ్‌లు వదిలిపెడుతుండడంతో పాటు బ్యాటింగ్ విభాగంలో మూడు సార్లు డకౌట్ రూపంలో వెనుదిరిగి నిరాశపరిచాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ డిమాండ్ చేస్తున్నాడు. అభిషేక్ శర్మకు బదులుగా ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.