
మిస్సమ్మ, అదిరందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. లిటిల్ హార్ట్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్, కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను ఈటీవీ విన్ అసోసియేషన్‌తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. మార్చి 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా హీరోయిన్ లయ మీడియాతో మాట్లాడుతూ “అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. కామెడీ జోనర్ అనేది అని వయస్సుల వారికి నచ్చుతుంది. ఈ కామెడీ సినిమాలో ఓ ఆసక్తికరమైన ట్విస్ట్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది డార్క్ కామెడీ జోనర్. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రంలో నేను ఉత్తర పాత్రలో నటించాను. మంగపతిలాంటి పవర్‌ఫుల్ పాత్ర చేసిన హీరోపై ఆధిపత్యం చేసే పాత్ర నాది. నేను, శివాజీ కలిసి నటించిన సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ట్రైలర్ బాగుంది. అందరికి నచ్చింది అంటున్నారు. సినిమా కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. అందరిని సంతృప్తిపరిచే సినిమా ఇది. దర్శకుడు సుధీర్ శ్రీరామ్ స్టోరీ ఎంత బాగా రాసుకున్నాడో అదేవిధంగా సినిమాను తెరకెక్కించాడు. ఇక ప్రస్తుతం వదల అనే సినిమాలో జగపతిబాబు భార్యగా చేస్తున్నాను. ఇది సైకలాజికల్ థ్రిల్లర్. శ్రీకాంత్‌తో కూడా ఓ సినిమా చేస్తున్నాను. నాగేశ్వర రెడ్డి దర్శకుడు. యమలీల తరహాలో సోషియో ఫాంటసీ సినిమా ఇది” అని అన్నారు.