
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ పాట విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పందిస్తూ చిత్రబృందాన్ని అభినందించారు.
“రైరై రా రా’ స్క్రీన్‌పై ఫైర్‌లా ఉంది. ఇది ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియన్స్ కలిసిన అద్భుతం. రామ్ చరణ్ అదిరిపోయే విధంగా డ్యాన్స్ చేయడం గొప్ప ఆనందాన్నిచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు సానా అద్భుతమైన పిక్చరైజేషన్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ అందించిన కంపోజిషన్, అలాగే జానీ మాస్టర్ అందించిన పవర్ ప్యాక్‌డ్ కొరియోగ్రఫీ అద్భుతంగా వున్నాయి. సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు అందించిన అద్భుతమైన విజువల్స్, గేయరచయిత అనంత శ్రీరామ్ రాసిన అర్థవంతమైన సాహిత్యం ఎంతగానో అలరించాయి. నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ అద్భుతమైన సినిమాను నిర్మాణం చేసినందుకు అభినందనలు” అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.