
హైదరాబాద్: అల్లుడు శీను సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు తనని ఎవరు పట్టించుకునేవారు కాదని హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. ఫైటింగ్ చేస్తున్నప్పుడు, డ్యాన్స్ చేస్తున్నప్పనుడు అక్కడ ఉన్నవారు ఒక్కరు కూడా తనని చూసేవారు కాదన్నారు. అల్లుడు శీను సినిమా షూటింగ్ విషయాలను బెల్లంకొండ గుర్తు చేశాడు. హీరోయిన్ సమంతతో రోమాన్స్ సీన్ చేస్తుంటే మాత్రం 200 మంది సభ్యులు నోరెళ్ల బెట్టి చూసేవారని సంచలన కామెంట్లు చేశాడు. ఆ సమయంలో తాను కొంచెం అసౌకర్యంగా కనిపించేవాడినని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టార్ హీరోయిన్‌తో నటించి ఈ సినిమాతోనే అతడు హిట్ కొట్టిన విషయం తెలిసిందే. స్పెషల్ సాంగ్‌లో బెల్లంకొండ పక్కన తమన్నా నటించిన విషయం తెలిసిందే. 2014వ సంవత్సరంలో వివినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌లో నిర్మించారు. ఈ మూవీకి దేవశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రఘుబాబులు నటించారు.