Reading Time: < 1 minute

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.

రంగారెడ్డి: గురుకుల విద్యార్థి చెరువులో పడి గల్లంతైన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిన వివరాల ప్రకారం… గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజు అనే విద్యార్థి మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ వసతి గృహంలో చదువుతున్నాడు.   ఫరూక్ నగర్ మండలం రాయికల్ శివారులో ఉన్న చెరువులో ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతయ్యాడు. మంగళవారం హోలీ సందర్భంగా సెలవు ఉండడంతో నలుగురు విద్యార్థులతో కలిసి చెరువులో ఈత కొట్టడానికి వెళ్లిన రాజు మధ్యాహ్నం నుండి ఇప్పటివరకు బయటకు రాలేదు. దీంతో పోలీసులు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించి చెరువలో గాలింపు చర్యలు చేపట్టారు.