Reading Time: < 1 minute

మూసీ సుం దరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీరివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో (ఎన్‌హెచ్‌ఆర్‌సి)లో కేసు నమోదు అయ్యింది. మూసీ ప్రా జెక్టు పేరుతో ఈ నది తీర ప్రాంతాల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని దీనిని అడ్డకోవాలని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఎన్‌హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించారు. ఎలాంటి సమగ్ర అధ్యయనం లేకుండా లంగర్‌హౌస్, నా ర్సింగి, రాందేవ్‌గూడ ప్రాంతాల్లో శతాబ్దాల నాటి వేలాది చెట్లను నరికివేస్తున్నారని ఈ ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. పర్యావరణ ప్రభావం, సామాజిక ప్రభావంపై ఎటువంటి సోషల్ ఇంపాక్ట్ స్టడీ నిర్వహించకుం డా పనులు ప్రారంభించారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. ప్రజల జీవనాధారాలపై తీవ్ర ప్రభావం చూపే విధంగా మూసీ తీరాలను ధ్వంసం చేస్తున్నారని ఆ యన స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.