Reading Time: 2 minutes

ఎల్పీజీ, జీఎస్టీ, ఐటీఆర్ కొత్తరూల్స్.. ఇవాళ్టి(ఆగస్టు1)నుంచే అమలులోకి..

Caption of Image.

దేశవ్యాప్తంగా ప్రజలజీవితాలను ప్రభావితం చేసే పలు కీలక ఫైనాన్షయిల్, బ్యాంకింగ్, ట్రాన్స్ పోర్టు రూల్స్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కమర్షియల్ వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరల తగ్గింపు, తత్కాల్ రైలు టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్, బ్యాంకింగ్ సేవల్లో మార్పులు, క్రెడిట్ కార్డు ఛార్జీల సవరణలు, GST ప్రక్రియలలో కొత్త రూల్స్ వంటి పలు కీలక నిర్ణయాలు అమలులోకి వచ్చాయి. వీటిలో కొన్ని కస్టమర్లకు ఊరటనిస్తే, మరికొన్ని అదనపు భారాన్ని మోపాయి. ఏమేం మారాయో ఓ లుక్కేద్దాం..

కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గాయ్..

ఇవాళ్టి(ఆగస్టు 1) నుంచి అమల్లోకి వచ్చిన అతిపెద్ద మార్పుల్లో ఒకటి19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర తగ్గింపు. కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గించారు. ఢిల్లీలో రూ. 202 తగ్గింపు తర్వాత 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2వేల728 ఉండగా కోల్‌కతాలో రూ. 2వేల872.50కి చేరింది. అయితే, గృహ వంటగ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేకపోవడంతో వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నారు. 

తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ రూల్స్ లో మార్పులు..

ఇవాళ్టినుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టోకెన్లు జారీ చేసే సమయం, తత్కాల్ బుకింగ్‌లు ప్రారంభమయ్యే సమయానికి అనుగుణంగా మొదట టోకెన్లు, ఆ తర్వాత టిక్కెట్లు జారీ చేస్తారు. 

బ్యాంక్ సర్వీస్ ఛార్జీలలో మార్పులు ..

కొన్ని బ్యాంకులు ఆగస్టు 1 నుంచి సర్వీస్ ఛార్జీలను సవరించాయి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన ఖాతాదారులకు SMS అలర్ట్‌లపై ఛార్జీలను వసూలు చేస్తామని ప్రకటించింది. 

 నిత్యావసర వస్తువుల ధరలు ..

ఆగస్టు నెలలో నిత్యావసర వస్తువలు ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.  అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ముడిసరుకుల వ్యయం,టీ, బట్టలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, కార్లు, సబ్బులు వంటి పలు ప్రాడక్టులపై ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని ఉత్పత్తుల ధరలు సుమారు 4 నుంచి 6 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు.  

 CKYC 2.0 అమలు..

ఆర్థిక సేవల విస్తరణ, కస్టమర్లు సౌకర్యంకోసం  CKYC2.0 తీసుకొచ్చారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు,మ్యూచువల్ ఫండ్ ప్రొవైడర్లు ఆగస్టు 1 నుంచి సెంట్రల్ నో యువర్ కస్టమర్ (CKYC) ను ప్రారంభించారు. CKYC2.0తో ఆర్థిక సంస్థలు అవసరమైన డిజిటల్ ఆమోదం పొందిన తర్వాత, కేంద్ర డేటాబేస్ ద్వారా కస్టమర్ల గుర్తింపు సమాచారాన్ని పొందుతాయి.దీంతో బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్ చేయాలన్నా, భీమా పాలసీలు కొనుగోలు చేయాలన్నా   ఇతర ఫైనాన్షియల్ సర్వీస్ ను వినియోగించేటప్పుడు ఎటువంటి కేవైసీ డాక్యుమెంట్లను పదేపదే సమర్పించాల్సిన అవసరం తగ్గుతుంది. 

కొత్త GST రూల్స్..

ఆగస్టు1నుంచి  వ్యాపారులు,  షాపు యజమానులు జీఎస్టీ విధానంలో కీలక మార్పులు అమలులోకి వచ్చాయి. ఈ ఇన్ వాయిస్ , ఈ వేబిల్ సిస్టమ్ ను బలోపేతం చేసేందుకు ఈ కొత్త రూల్స్ తెచ్చారు.బిల్ టు షిప్ టు లావాదేవీలు జరిపే వ్యాపారులు షిప్-టు GSTINను అందించాల్సి ఉంటుంది.

©️ VIL Media Pvt Ltd.