Reading Time: 2 minutes
House Construction: సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారా? ఇంటి నిర్మాణ లైసెన్స్ పొందడం ఎలాగో తెలుసా?

House Construction: సొంతిల్లు నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. ఎప్పటికైనా సొంత ఇంటిని నిర్మాణం చేసుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే, కేవలం స్థలం (ప్లాట్) కొనుగోలు చేసినంత మాత్రాన లేదా మన సొంత స్థలం ఉన్నంత మాత్రాన నేరుగా ఇల్లు కట్టేయడం అంత సులవు కాదు. స్థానిక ప్రభుత్వ నియమావళి ప్రకారం ఇల్లు నిర్మించే ముందు సంబంధిత అధికారుల నుండి తప్పనిసరిగా ‘బిల్డింగ్ పర్మిషన్’ (లేదా బిల్డింగ్ లైసెన్స్) పొందాల్సి ఉంటుంది.

అనుమతులు లేకుండా నిర్మిస్తే ఏమవుతుంది?

అనుమతి లేకుండా ఇంటి నిర్మాణాలు చేపడితే భవిష్యత్తులో నోటీసులు రావడం, జరిమానాలు పడటం లేదా కరెంట్, నీటి సరఫరా కనెక్షన్లు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించుకోండి. ఇంటి నిర్మాణం విషయంలో కొన్ని పనులు ముందస్తుగా చేసుకోవడం ఉత్తమం. లేకుంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే ఇంటి నిర్మాణ లైసెన్స్ ఎలా పొందాలి? దానికి ఏయే పత్రాలు అవసరమో పూర్తి వివరంగా తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఆగస్ట్‌లో తెలుగు రాష్ట్రాల్లో భారీగా సెలవులు!

బిల్డింగ్ లైసెన్స్ కోసం అవసరమైన ముఖ్యమైన పత్రాలు:

  • ఇంటి నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకునే ముందు ఈ కింది డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి.
  • సేల్ డీడ్ (రిజిస్ట్రేషన్ పత్రాలు): స్థలం మీ పేరు మీద ఉన్నట్లు నిరూపించే రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌.
  • హక్కుపత్రం / లింక్ డాక్యుమెంట్లు: స్థలానికి సంబంధించిన టైటిల్ డీడ్ లేదా ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ (EC).
  • బిల్డింగ్ ప్లాన్: గుర్తింపు పొందిన ఆర్కిటెక్ట్ లేదా లైసెన్స్డ్ ఇంజనీర్ ద్వారా రూపొందించిన ఇంటి ప్లాన్/మ్యాప్.
  • ఆస్తి పన్ను రశీదు: స్థలానికి సంబంధించిన ఇటీవల చెల్లించిన ప్రాపర్టీ టాక్స్ రశీదు.
  • గుర్తింపు కార్డులు: అర్జిదారుడి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్.
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు: యజమాని ఫోటోలు.

ఇంటి నిర్మాణ అనుమతి పొందే విధానం:

1. పరిధిని గుర్తించడం: మీరు ఇల్లు కడుతున్న స్థలం ఏ పరిధిలోకి వస్తుందో మొదట నిర్ధారించుకోండి. అది గ్రామ పంచాయతీయా, మున్సిపాలిటీ, కార్పొరేషన్ లేదా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి వస్తుందో తెలుసుకోవాలి.

2 దరఖాస్తు సమర్పణ: పట్టణ ప్రాంతాల్లో ఐతే సంబంధిత మున్సిపాలిటీ/కార్పొరేషన్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా లేదా సేవా కేంద్రాల ద్వారా అప్లై చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాలైతే గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

3 క్షేత్రస్థాయి పరిశీలన: మీ దరఖాస్తును పరిశీలించిన తర్వాత సంబంధిత ఆఫీసర్లు లేదా ఇంజనీర్లు మీ స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. మీరు సమర్పించిన ప్లాన్ నిబంధనలకు (మాస్టర్ ప్లాన్, సెట్‌బ్యాక్‌లు మొదలైనవి) అనుగుణంగా ఉందో లేదో చెక్ చేస్తారు.

4 ఫీజు చెల్లింపు: స్థలం విస్తీర్ణం, ప్లాన్ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయించిన లైసెన్స్ ఫీజు, డెవలప్‌మెంట్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

5 లైసెన్స్ పొందుట: అధికారుల అనుమతి, ఫీజు పూర్తయిన తర్వాత డిజిటల్ సంతకంతో కూడిన బిల్డింగ్ పర్మిషన్ ఆర్డర్ లేదా లైసెన్స్ సర్టిఫికేట్ జారీ చేస్తారు.

చాలా మంది తరచూ అడిగే ప్రశ్నలు:

  • ఇంటి నిర్మాణానికి అనుమతి (లైసెన్స్) తప్పనిసరిగా తీసుకోవాలా?

అవును చట్టబద్ధంగా ఇల్లు నిర్మించాలన్నా, భవిష్యత్తులో ఇంటి నంబర్, కరెంట్ మీటర్, డ్రైనేజీ/కుళాయి కనెక్షన్లు పొందాలన్నా స్థానిక సంస్థల నుంచి పర్మిషన్ తీసుకోవడం తప్పనిసరి.

  • దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చా?

అవును చాలా ప్రాంతాల్లో ఇప్పుడు ఆన్‌లైన్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారానే బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ జరుగుతోంది. అనుమతులు తీసుకున్న తర్వాతే ఇంటి నిర్మాణం ప్రారంభించడం వలన ఎటువంటి చట్టపరమైన సమస్యలు లేకుండా ప్రశాంతంగా మీ డ్రీమ్ హౌస్‌ను నిర్మించుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Gas Cylinder Price: గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి