Reading Time: < 1 minute

చెట్టుకు ఉరివేసుకొని ప్రమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటనా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా రాపూర్ ఘాట్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న(25) కు సోషల్ మీడియాలో చిట్టమూరుకు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. మంగళవారం రావూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలంలో పురుగుల మందు డబ్బా గుర్తించారు. అయితే ఆ మహిళకు ఇదివరకే పెళ్లై ఇద్దరు పిల్లలున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.