Reading Time: < 1 minute

పెద్ది చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘రైరై రారా’లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యాన్స్ చూసి కేవలం అభిమానులు మాత్రమే కాదు హీరోయిన్ సమంత కూడా ఫిదా అయ్యారు. చరణ్ మాస్ స్టెప్స్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. రామ్ చరణ్ ఒకే ఒక్కడు అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్, – సమంత కలిసి రంగస్థలం సినిమాలో నటించారు. అప్పటి నుంచి సామ్.. చరణ్ యాక్టింగ్ కి, డ్యాన్స్ కి పెద్ద ఫ్యాన్.