
యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో హృదయ విచారకర ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గొల్లగూడెం గ్రమానికి చెందిన గ్రామానికి చెందిన మేకల ఐశ్వర్య (28) అనే వివాహిత తెల్లవారుజామున తన ఇద్దరు పిల్లలు కుమార్తె ఝాన్సీ (2), కుమారుడు పండు( 9 )నెలల పసికందును హతమార్చి అనంతరం ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు రాసిన మూడు పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కుటుంబ కలహాలు, భర్త మహేష్‌కు వివాహేతర సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు చేసినట్లు ఏసీపీ బి. రవీందర్ వెల్లడించారు.ఐదేళ్ల క్రితం ఐశ్వర్యకు మహేష్‌తో వివాహం జరిగింది.
వివాహం జరిగిన కొద్ది నెలలకే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో ఆమె ఏడాదిన్నర కాలంగా వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో తల్లిదండ్రుల వద్దే ఉంటుంది.ఇటీవల తల్లిదండ్రులు ఆమెను బీబీనగర్ మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామం లోని అత్తగారింటివద్ద వదిలివెళ్లారు.వదిలివెళ్లిన కొన్ని గంటలకే ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.ఘటన సమయంలో భర్త మహేష్ రైల్వే ఉద్యోగిగా విధుల్లో ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.ఈ విషాద ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.మృతురాలి బంధువులు ఆందోళనకు దిగడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.