Reading Time: < 1 minute

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం ఢిల్లీకి పిలుస్తామని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఢిల్లీకి పిలుస్తారా? ఫోన్ లో చర్చిస్తామా? అని సాయంత్రం నిర్ణయిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాజ్యసభ రేసులో 16 మంది ఉన్నారని, రాజ్యసభ సభ్యుల గురించి సోమవారం 30 నిమిషాల చర్చ జరిగిందని తెలియజేశారు. ఎవరు రేస్ లో ఉన్నారేది చెప్పలేమని, జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ స్థానాన్ని అడగడం లేదని చెప్పారు. ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్ని సమీకరణాలను బేరీజు వేస్తారని, ఎఐసిసి సామాజిక కూర్పుతో అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ ఉందని అన్నారు. నలుగురు బిసిలు రాజ్యసభ అవకాశం ఇవ్వమని అడుగుతున్నారని, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు..డిసిసిలకు సహకరించడం లేదని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.  తెలంగాణ నుంచి ఒకరా.. ఇద్దరా అనేది రేపు తెలుస్తుందని, ఈ నెలలో కొన్ని కార్పొరేషన్ పదవుల భర్తీ అవుతాయని అన్నారు. రాజకీయ కోసమే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారని, కేరళలో త్వరలో కాంగ్రెస్ దే అధికారం అని..అన్నారు. ఆపరేషన్ కగార్ కు తాము వ్యతిరేకమని, మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని మహేష్ గౌడ్ కోరారు.