Reading Time: < 1 minute

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ పామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. టి20 వరల్డ్ కప్ లో మూడ సార్టు డకౌట్ కావడంతో పాటు ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. ఇప్పటివరకు ఏడు ఇన్నింగ్స్ లలో కలిపి 80 పరుగులు మాత్రమే చేసి బ్యాటర్ గా విఫలమయ్యాడు. వరల్డ్ కప్ లో బ్యాటింగ్ లో ఇరగదీస్తాడని అభిమానులు అనుకున్నారు కానీ తుస్సుమనిపించాడు. స్పిన్ ఎదుర్కొవడంలో ఇబ్బంది పడుతుండడంతో ప్రత్యర్థి జట్లు స్పిన్ ఉచ్చులో పడేసి అభిషేక్ ను త్వరగా ఔట్ చేస్తున్నారు. వెస్టిండీస్ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో అభిషేక్ 11 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. రెండు క్యాచ్ లు కూడి వదిలేయడంతో ఐపిఎల్ కే పని కొస్తాడని క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా అభిషేక్ శర్మకు మాజీ క్రికెటర్ మనోజ్ తీవారీ పలు సూచనలు చేశాడు. మన వికెట్ కు మనమే విలువ ఇవ్వాలని, లేకుంటే పేలవమైన షాట్లు ఆడి వికెట్లు పారేసుకోవద్దని సూచించారు. విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడితేనే సూపర్ స్టార్ గా ఉంటాడని, తక్కువ సమయంలో సూపర్ స్టార్ ఎదిగాడని, అలానే పేరు నిలుపుకోవాలంటే మంచి ఇన్నింగ్స్ లు నిర్మించాలని సలహా ఇచ్చాడు. టీమిండియాలో స్థానం కోసం విపరీతమైన పోటీ ఉందని, అతడి ఫీల్డింగ్ కూడా సరిగా లేదని, ఫీల్డింగ్ మెరుగు పరుచుకోవడంతో పాటు అతడి మైండ్ సెట్ లో మార్పు రావాలని సంజయ్ సూచించాడు.