
ఢిల్లీ: ప్రస్తుత మౌనం ప్రపంచదేశాల్లో భారత్ కు ఉన్న ప్రాధాన్యత, ప్రతిష్టను దెబ్బతీస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. మీ మౌనం దేశస్థాయిని తగ్గిస్తుందని అన్నారు. ఇరాన్ సుప్రీం అయతొల్లా అలీ ఖమేని హత్యపై భారత్ మౌనాన్ని తప్పుపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఖమేనీ హత్యపై మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని.. ఒక దేశాధినేత హత్యకు మద్దతు ఇస్తున్నారా? అని రాహుల్ ప్రశ్నించారు. భారత్ నైతికంగా స్పష్టమైన వైఖరితో ఉండాలని, ప్రధాని మోడీ ఇప్పటికైనా మాట్లాడాలని కోరారు. ఇరాన్ పై దాడులతో కోట్లాదిమంది ప్రజలు అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నారని, కోటిమంది భారతీయులు చిక్కుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హింస మరింత హింసకు దారి తీస్తుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.