
చంద్రగ్రహణం కారణంగా మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ తలుపులను మూసివేస్తు న్నట్లు టిటిడి అధికారులు సోమవారం ప్రకటించారు. చంద్రగ్రహణ ప్రభావం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన విఐపి బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను అధికారులు పూర్తిగా రద్దు చేశారు. సోమవారం రాత్రి వరకు మాత్రమే భక్తులను క్యూలైన్లలోకి అనుమతించనున్నారు. అలాగే తిరుప తిలో జారీ చేసే మంగళవారం కోటా సర్వదర్శనం టోకెన్లను కూడా రద్దు చేస్తున్నట్లు టిటిడి స్పష్టపర్చింది. మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి, భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్ల వరకు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం ఒక్కరోజే 83,122 మంది భక్తులు శ్రీవారిని దర్శిం చుకోగా, 30,054 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 4.49 కోట్ల రూపాయలు. గ్రహణం వీడినానం తరం ఆలయ శుద్ధి, ఇతర సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించి, మంగళవారం రాత్రి 7.30 గంటల తర్వాతే భక్తులను తిరిగి దర్శనానికి అనుమ తించనున్నారు.