
తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా క్యూలైన్‌లో రెండు కుటుం బాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలివానలా మారడంతో రెండు కుటుంబాలు క్యూలైన్‌లోనే పరస్పరం దాడు లకు తెగబడ్డాయి. దీంతో తోటి భక్తులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. గమనించిన శ్రీవారి సేవకులు వెంటనే టిటిడి విజిలెన్స్, పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న టిటిడి అధికారులు భక్తులకు సర్ధిచెప్పారు. అనంతరం ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై అధికారులు ఆరా తీశారు. మిగిలిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనకు సంబంధిం చిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.