
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హోళీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి పండుగగా హోళీని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ప్రేమ, ఆప్యాయత, సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే పండుగ హోళీ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సహజ సిద్ధమైన రంగులు, సంప్రదాయ పద్ధతులతో పండుగను జరుపుకోవాలన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజల సమైక్యతను చాటే పండుగ హోళీని వేడుకగా జరుపుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.