Reading Time: < 1 minute

టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మికలు కొద్ది రోజుల క్రితం వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్ల పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. కాగా విజయ్ ప్రస్తుతం నటిస్తున్న రీసెంట్ చిత్రాల్లో ఒకటి ‘రణబాలి’. విరోషల వివాహ సందర్భంగా రణబాలి టీం ఓ సర్‌ప్రైజ్‌ వీడియోని విడుదల చేసింది. ‘‘ఏందయ్య సామీ’’ అంటూ సాగే పాటను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోతుందని ఈ పాట చూస్తే అర్థమవుతోంది.

కాగా, విజయ్ సరసన ఈ మూవీలో రష్మికనే హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గీత గోవిందం’ సినిమా సూపర్ హిట్ కాగా.. ‘డియర్ కామ్రేడ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన యూత్‌కి బాగా కనెక్ట్ అయింది. ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం ‘రణబాలి’. అది కూడా వీరిద్దరి పెళ్లి జరిగిన తర్వాత వస్తుండటంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది.