
వాషింగ్టన్: ఇరాన్ పై అమెరికా పెద్ద ఎత్తున యుద్ధ కార్యకలాపాలకు దిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ కు వ్యతిరేకంగా అమెరికా భారీ సైనిక చర్యను ప్రారంభించిందని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్ పై అమెరికా దాడులు చేస్తోందని, ఇరాన్ పాలకుల ముప్పు నుంచి అమెరికాను రక్షించడమే తమ లక్ష్యమని తెలియజేశారు. ప్రపంచంలో ఉగ్రవాదానికి ఇరాన్.. అతిపెద్ద మద్దతుదారు అని.. ఇటీవల నిరసనలు చేస్తున్న తన సొంత పౌరులనే వీధుల్లో చంపేసిందని విమర్శించారు. ఉగ్రవాద పాలనలో ఉన్న దేశానికి ఎప్పటికీ అణు ఆయుధాలు ఉండకూడదని, అణు ఆయుధాల కోసం వారు చేసే దుర్మార్గపు ప్రయత్నాలు మానుకోవాలని అని సూచించారు. తన మాట వినకుంటే ఇరాన్ ను నాశనం చేస్తాం అని ట్రంప్ హెచ్చరించారు.