
ఢిల్లీ: లిక్కర్ కేసులోఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చాట్ ఇచ్చింది. కేజ్రీవాల్ పై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు ఆధారాలు లేవని అవెన్యూ కోర్టు చెప్పింది. దీంతో భావోద్వేగానికి గురై కేజ్రీవాల్ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. తన జీవితంలోఎన్నడూ తప్పు చేయలేదని, తనపై తప్పుడు కేసులు పెట్టి, జైలుకు పంపారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఐదుగురు నేతలను జైల్లో పెట్టారని, కేజ్రీవాల్ ఏనాడు అవినీతికి పాల్పడలేదని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్లం తాము అని తెలియజేశారు. కేవలం విపక్షాలపైనే ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాటు, మరో 20 మంది నిందితులకు ఊరట లభించింది. కవితపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 5 నెలల పాటు కవిత జైల్లో ఉన్నారనే విషయం తెలిసిందే.