Reading Time: 2 minutes
RGV: ఇదేందయ్యా..! ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.? అది కూడా ఓ గుడిలో

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. ఒకప్పుడు సెన్సేషనల్ హిట్స్ అందించిన రామ్ గోపాల్ వర్మ.. ఆతర్వాత కొన్ని బయోపిక్స్ అలానే కొన్ని వివాదాస్పద సినిమాలు చేసి వార్తల్లో నిలిచారు. అలాగే కొన్ని వివాదాల్లొనూ చిక్కుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆర్జీవీ గురించి ఓ సంచలన వార్త వైరల్ గా మారింది. ఓ స్టార్ హీరోయిన్ ను ఆర్జీవీ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు ఊర్మిళా మటోండ్కర్. బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్, రామ్ గోపాల్ వర్మల మధ్య గతాన్ని తవ్వితీస్తూ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ ఇటీవల పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, ఊర్మిళా, అప్పటికే వివాహితుడైన రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారని సంచలన కామెంట్స్ చేశారు. ఊర్మిళా తన భర్త మోహ్సిన్ అక్తర్‌తో విడాకులు తీసుకున్న రెండేళ్ల తర్వాత ఈ వార్త రావడం గమనార్హం.

ఇది కూడా చదివేయండి : రోజుకు 3లక్షలు రెమ్యునరేషన్.. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది.. చివరకు అనాధలా చనిపోయింది

ఒకప్పుడు ఊర్మిళా మటోండ్కర్‌తో రామ్ గోపాల్ వర్మ వ్యవహారం గాసిప్ కాలమ్స్‌లో సంచలనం సృష్టించిందని, ఈ కారణం వల్ల ఆయన వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తాయని జ్యోతి గుర్తు చేసుకున్నారు. ఆతర్వాత ఆర్జీవీ రహస్య వివాహం గురించిన తన వాదనలతో ఆమె మరింత దుమారం రేపారు. ఇండస్ట్రీలోని కొంతమంది వ్యక్తులకు కూడా ఈ వివాహం గురించి తెలుసునని జ్యోతి వెంకటేష్ తెలిపారు.అలాగే హిందీ సినిమా జెంటిల్‌మన్ షూటింగ్‌లో చిరంజీవిని కలిసినప్పుడు, రామ్ గోపాల్ వర్మ, ఊర్మిళల వివాహం గురించి తాను ఎందుకు రాయలేదని చిరంజీవి తనను అడిగారని జ్యోతి తెలిపారు. తనకు ఎఫైర్ అనే వార్తల గురించి తెలుసునని, కానీ పెళ్లి గురించి తెలియదని చెప్పగా, చిరంజీవి వారిద్దరికీ పెళ్లి జరిగిందని, ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారని చెప్పారని జ్యోతి వెంకటేష్ పేర్కొన్నారు. చిరంజీవి స్వయంగా ఆ గుడిలో పెళ్లి జరిపించిన వ్యక్తి నంబర్‌ను కూడా తనకు ఇచ్చారని జ్యోతి వెల్లడించారు. దీని ఆధారంగానే తాను తన మ్యాగజైన్‌లో వారి వివాహం గురించి రాశానని ఆమె తెలిపారు.

ఇది కూడా చదివేయండి : అతనికి 29, ఆమెకు 53..! 6 ఏళ్లుగా ఓటీటీని షేక్ చేస్తున్న రొమాంటిక్ సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే

ఈ ఆర్టికల్ రాయడానికి ముందు, జ్యోతి వెంకటేష్ ఊర్మిళా మటోండ్కర్‌ను సంప్రదించారట. పెళ్లి గురించి అడగగానే ఊర్మిళా ఏడవడం ప్రారంభించారని జ్యోతి చెప్పారు. “మీకు నేను ఎంతకాలంగా తెలుసు? నా గురించి మీరు ఇలా ఎలా రాయగలరు?” అని ఊర్మిళా ప్రశ్నించినట్లు జ్యోతి తెలిపారు. అయితే, ఏడ్చినప్పటికీ, ఊర్మిళా ఆ వివాహాన్ని ఖండించలేదని, ఎలాంటి సమాధానం ఇవ్వలేదని జ్యోతి స్పష్టం చేశారు. అదేవిధంగా, రామ్ గోపాల్ వర్మను సంప్రదించి వివాహం గురించి అడిగినప్పుడు, ఆయన ఎలాంటి వ్యాఖ్య చేయడానికి నిరాకరించారు. “మీ భార్య ఏడుస్తోంది, మీరు ఒక నటితో ఎఫైర్ నడుపుతున్నారు” అని తాను చెప్పినప్పుడు కూడా, రామ్ గోపాల్ వర్మ దీనిపై మాట్లాడదలుచుకోలేదని మాత్రమే అన్నారని జ్యోతి తెలిపారు. అలాగే రామ్ గోపాల్ వర్మ, ఊర్మిళల బంధం విడిపోవడానికి గల కారణాన్ని కూడా జ్యోతి ఈ పోడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. జ్యోతి వెంకటేష్ ప్రకారం, ఊర్మిళా చట్టబద్ధంగా వివాహం చేసుకోవాలని కోరుకున్నారు, కానీ రామ్ గోపాల్ వర్మ ఈ పెళ్లికి సిద్ధంగా లేరు. ఆయన ఊర్మిళాను చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోవడంతో, ఇద్దరూ విడిపోయారని జ్యోతి వెంకటేష్ తెలిపారు. ప్రస్తుతం ఈ సంచలన ఆరోపణలపై ఊర్మిళా మటోండ్కర్, రామ్ గోపాల్ వర్మ ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇది కూడా చదివేయండి : చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.. పెద్ద హీరో అవుతానుకుంటే.. 38ఏళ్ల వయసులోనే చనిపోయాడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.