
హైదరాబాద్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా సూపర్-8లో జింబాబ్వేపై భారత్ గెలుపొందింది. జింబాబ్వేపై టీమిండియా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాట్స్‌మెన్లు బ్యాట్ ఝుళిపించడంతో నాలుగు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. జింబాబ్వే జట్టు 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో సంజూ శామ్సన్ 15 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్స్‌లతో 24 పరుగులు చేశారు. తొలి వికెట్‌పై ఓపెనర్లు 48 పరుగులు చేశారు. దూకుడుగా ఆడే క్రమంలో బ్లెస్లింగ్ ముజారబానీ బౌలింగ్‌లో ర్యాన్‌బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. పెద్ద స్కోర్‌గా మలచలేకపోవడంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి.
ఈ సందర్భంగా సంజు శామ్సన్‌కు మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మద్దతు పలికాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్లు రావడంతో వారిని ప్రత్యర్థి జట్లు స్పిన్ ఉచ్చులో బిగించి ఔట్ చేశారని గుర్తు చేశారు. పాకిస్థాన్ జట్టు సల్మాన్ అలీ అఘా, నెదర్లాండ్ జట్టు ఆర్యన్ దత్, సౌతాఫ్రికా జట్టు మార్‌క్రమ్ స్పిన్ బౌలింగ్‌లో ఓపెనర్ల వికెట్లు తీశారన్నారు. ఈ మ్యాచ్ లో సంజూ, అభిషేక్ ఓపెనర్లుగా రాణించారని ప్రశంసించారు. ఓపెనర్లు ఇచ్చిన ఆరంభంతోనే జింబాబ్వేపై భారీ స్కోరు చేశారన్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ బాగుందని, పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేసే క్రమంలో సంజు వికెట్ కోల్పోయారన్నారు. ఈ విషయంలో అతడిని నిందించలేమని, పవర్ ప్లేలో ఫీల్డింగ్ నిబంధనలు నుంచి ప్రయోజనం రాబట్టే క్రమంలో అతడు వికెట్ పారేసుకున్నాడని సునీల్ వివరణ ఇచ్చాడు.