Reading Time: < 1 minute

లక్నో: క్రికెటర్ రింకూ సింగ్ ఇంట‌ విషాదం చోటుచేసుకుంది. రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ర సింగ్ కన్నుమూశారు. నోయిడాలోని ఓ ఆస్పత్రిలో లివర్ క్యాన్సర్‌తో పోరాడుతూ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా రింకూ సింగ్ తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.  జింబాబ్వే జరిగిన మ్యాచ్‌కు ముందు రింకు టీమ్‌ను వీడాడు. లివర్ క్యాన్సర్ ఫోర్ట్ స్టేజీలో ఉంది. యుపిలోని అలీఘడ్‌లో ఎల్‌పిజి గ్యాస్ డెలివరీ బాయ్‌గా పని చేసేవాడు. ఖాన్‌చంద్ మృతిపట్ల టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులు ప్రగాఢ సానూభూతి ప్రకటించారు. అతడి కుటుంబానికి ఇది చాలా కష్టమైన సమయం అని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరలని, ఆయన బలం, ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్తిస్తున్నానన్నారు.